ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా..? | - | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా..?

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా..? ఇప్పుడు చేస్తున్నది దుబారా కాదా? ●

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించాం. ప్రతి ఇంటి కీ ప్రభుత్వ పథకాలు చేరువ చేశాం. వలంటీర్లకు ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలోతొక్కి వ్యవస్థనే రద్దు చేసింది. మాకిచ్చిన కేవలం రూ.5 వేల గౌరవ వేతనంతో ప్రజాధనం దుర్వినియో గం అయిపోతోందని విమర్శించిన పాలకులకు ఇప్పుడు వారి సొంత డప్పు కొట్టేందుకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లకు రూ.లక్షలు చెల్లిస్తామని జీఓ విడుదల చేశారు. ఇది కదా ప్రజాధనం దుర్వినియోగం అంటే?

– తియ్యాల పోలిరాజు, వలంటీరు, వీరఘట్టం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా గడపగడపకు ప్రభుత్వ పథకాలు చేరువచేయడంలో వలంటీర్లు కీలక భూమిక పోషించారు. కేవలం రూ.5వేల గౌరవ వేతనంతో ప్రజలకు సేవచేశాం. మాకిచ్చిన రూ.5వేల గౌరవ వేతనం దుబారా అంటూ ప్రచారం చేసిన కూటమి నాయకులకు... ఇప్పుడు టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు లక్షలాది రూపాయలు దోచి పెట్టడం కనిపించకపోవడం విచారకరం. ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వం.

– సఖినాన లక్ష్మునాయుడు, వలంటీరు,

మహదేవివలస, వీరఘట్టం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement