శ్రీయాన్‌ ఐబీఏపీఎల్‌తో జేఎన్టీయూ జీవీ ఎంవోయూ | - | Sakshi
Sakshi News home page

శ్రీయాన్‌ ఐబీఏపీఎల్‌తో జేఎన్టీయూ జీవీ ఎంవోయూ

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

శ్రీయాన్‌ ఐబీఏపీఎల్‌తో జేఎన్టీయూ జీవీ ఎంవోయూ

విజయనగరం రూరల్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ గురజాడ విజయనగరం (జేఎన్‌టీయూజీవీ), విశాఖపట్నానికి చెందిన శ్రీయాన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అడ్వైజరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో బుధవారం కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ వి.వి.సుబ్బారావు, రిజిస్ట్రార్‌ కె.సి.బి.రావు, శ్రీయానన్‌ డైరెక్టర్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌ ఎంవోయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందంతో విద్య–పరిశ్రమ అనుసంధానం మరింత బలోపే తం కావడంతో పాటు, భవిష్యత్‌ గ్రీన్‌ టెక్నాలజీలు, ఏఐ, రోబోటిక్స్‌, సుస్థిరత రంగాల్లో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందేందుకు అవకాశం కలుగుతుందని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. పునరుత్పాదక ఇంధనం, సుస్థిరత, ఇంధన పొదుపు, కత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌, ఈఎస్‌జీ, కార్బన్‌ మేనేజ్‌మెంట్‌ తదితర ఆధునిక రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లను అందించ డమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులకు పరిశ్రమల సమస్యల పరిష్కాంపై ప్రాక్టికల్‌ శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు అందించే అవకాశం ఉంటుంది. బీటెక్‌ చివరి సంవత్సరం, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థుల ప్రాజెక్టులకు పరిశ్రమ నిపుణులు మార్గదర్శకత్వం అందించడంతో పాటు విద్యార్థుల ఆలోచనలను ప్రోటోటైప్‌ నుంచి వ్యాపార నమూనా, వాణిజ్యీకరణ దిశగా తీసుకెళ్లేందుకు సహకారం అందించనున్నారు.

‘లివింగ్‌ ల్యాబొరేటరీ’గా క్యాంపస్‌..

జేఎన్‌టీయూ జీవీ ప్రాంగణాన్ని దశలవారీగా సుస్థిర, స్మార్ట్‌ క్యాంపస్‌ ‘లివింగ్‌ ల్యాబొరేటరీ’గా అభివద్ధి చేసే అవకాశాన్ని ఎంవోయూ ప్రతిపాదిస్తోంది. సౌర విద్యుత్‌, ఇంధన సామర్థ్యం, నీరు– వ్యర్థాల నిర్వహణ, గ్రీనన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌, ఈఎస్‌జీ డేటా మానిటరింగ్‌ వంటి అంశాల్లో ప్రయోగాత్మక కార్యకలాపాలకు అవకాశం కల్పించనున్నారు. సోలార్‌ ట్రైనింగ్‌ ల్యాబ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌, ఈవీ చార్జింగ్‌ డెమో యూనిట్లు, ఐఓటీ/ఏఐ ఆధారిత ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, రోబోటిక్స్‌ డెమో యూనిట్లు, కార్బన్‌–ఈఎస్‌జీ డేటా ల్యాబ్‌తో కూడిన ‘రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఈఎస్‌జీ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ఏర్పాటును కూడా పరిశీలించనున్నారు. కార్బన్‌ డ్యాష్‌ బోర్డు లు, ఉద్గారాల తగ్గింపు అవకాశాల గుర్తింపులో విద్యార్థులకు భాగస్వామ్యం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement