కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలో స్టాంపుల కొరత లేదని జిల్లా రిజిస్ట్రార్ పార్వతి తెలిపారు. కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా న్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందుతున్న సేవలను సబ్ రిజిస్ట్రార్ ఆర్.కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3.96 కోట్ల ఆదాయార్జన లక్ష్యంకాగా 82 శాతం మేర సాధించామన్నారు. జిల్లా లో ఇటీవల ఏర్పడిన స్పాంపుల కొరత సమస్య తీరిందని, ప్రస్తుతం అన్నిరకాల స్టాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే సెల్: 94409 74628కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్నారు.


