● ఇండోర్‌లో జరిగిన పోటీల్లో 8 కాంస్య పతకాలు కై వసం
విజయనగరం: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు జరిగిన 43వ నేషనల్ జూనియర్, 40వ నేషనల్ సబ్–జూనియర్ క్యోరుగి తైక్వాండో చాంపియనన్ షిప్–2026లో విజయనగరం జిల్లా క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 8 కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎన్.హర్షిణి, వి.రోహిణి, ఎస్.జాజిలి, కె. నీహారిక, ఆర్. పూర్ణ చందు, డి. కార్తికేయ, డి. ధనేష్‌లు ఒక్కో కాంస్య పతకం సాధించగా, టి. జతిన్ రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. జాతీయస్థాయిలో జిల్లాకు ఘనత తెచ్చిన ఈ విజేతలకు విజయనగరం రైల్వే స్టేషన్‌లో జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. వేణుగోపాల్ రావు, కోచ్‌లు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా మెరిసి మరిన్ని విజయాలు సాధించాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.


