● నేత్రాలపట్ల అప్రమత్తత అవసరం
● కంటిసమస్యలపై నిర్లక్ష్యం తగదు
● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం
కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఎలాంటి సమస్య లేకున్నా ఏడాదికి ఒకసారి అయినా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
● ఆకుకూరలు, పండ్లు, విటమిన్ ఎ అధికంగా ఉండే కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
● బీపీ, సుగర్ అదుపులో ఉంచుకోవాలి.
● మురికి చేతులతో కళ్లను పదేపదే రుద్దడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.
● వెల్డింగ్, పరిశ్రమలు, వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాలి.
● వైద్యుని సలహా లేకుండా కంటి డ్రాప్స్ వాడకూడదు.
● ఆకస్తాత్తుగా చూపు మందగించడం, తీవ్రమైన నొప్పి కంటి గాయాలైతే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటిరోగిని పరీక్షిస్తున్న వైద్యుడు
నేడు ప్రపంచ
దృష్టి దినోత్సవం
విజయనగరం ఫోర్ట్:
మనిషిజీవితంలో అత్యంతఅమూల్యమైన వరం కంటి చూపు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి క్షణం ప్రపంచాన్ని అస్వాదించాలన్నా, చదువు, ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలన్నా చూపు సక్రమంగా ఉండడం ఎంతో ముఖ్యం. అయితే చాలా మంది కంటి సమస్యలను ప్రారంభంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే అసలు ముప్పునకు దారితీస్తోంది.గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. కంటి చూపు తగ్గేవరకు ఆగకుండా ముందే కంటి పరీక్షలు చేయించుకోవాలి. దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపించడం, చదవడంలో ఇబ్బంది తరచూ తలనొప్పి కళ్లలో మంట లేదా అలసట వంటిలక్షణాలు చాలా మంది పట్టించుకోరు. కాపీ ఈలక్షణాలు గ్లకోమా, రెటీనా, కంటి శుక్లం సమస్యలకు సంకేతం కావచ్చు. గ్లకోమా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు చూపించకుండానే క్రమంగా చూపును దెబ్బతీస్తుంది.
కంటిచూపుపై మొబైల్స్ ప్రభావం
నేటి ఽఆధునిక కాలంలో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఆన్‌లైన్ క్లాసుల కారణంగా పిల్లల కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు దృష్టి పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. క్లాస్ రూమ్‌లో బ్లాక్ బోర్డు సరిగా కనిపించకపోవడం, పుస్తకాన్ని ముక్కుకు దగ్గరగా పెట్టుకుని చదవడం, కళ్లను పదేపదే రుద్దడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలి. స్క్రీన్ టైమ్‌ను తగ్గించి పిల్లలు రోజూ బయట ఆట ఆడేలా ప్రోత్సహించాలి. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడడం పాటించాలి.
కంటి సమస్యలు అశ్రద్ధ చేయరాదు
కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. కంటి సమస్యలను అశ్రద్ధ చేయకూడదు. అదేవిధంగా సొంతంగా మందులు వాడడం గాని, పసరు మందులు గాని వేసుకోకూడదు. చూపు లేకపోతే జీవితం అంధకారమే. కావును కళ్లను పరిరక్షించుకోవాలి. డాక్టర్ కె. త్రినాథ్ రావు,
జిల్లా అంధత్వ నివారణ సంస్థ పోగ్రాం మేనేజర్
సుగర్ వ్యాధిగ్రస్తులు అప్రమత్తం
సుగర్ వ్యాధి గుండె, కిడ్నీలపైనే కాకుండా కళ్లపై కూడా తీవ్ర ప్రభావం
చూపుతుంది. సుగర్ లెవల్స్ అదుపులో లేకపోతే డయాబెటిక్ రెటినోపతి కారణంగా చూపు కోల్పేయే ప్రమాదం ఉంది. కాబట్టి సుగర్ ఉన్న
ప్రతి బక్కరూ రెటీనా పరీక్షలు చేయించుకోవాలి.


