జాతీయ స్థాయి పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు వ్యాయామ ఉపాధ్యాయుడు

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

కురుపాం: జాతీయస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు కురుపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పి.హరికృష్ణ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు తోట శంకరరావు బుధవారం తెలిపారు. గత నెల 12,13 వ తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.ఈ నెల 9వ తేదీన కోయంబత్తూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఐదు కిలోమీటర్ల విభాగం, 800 మీటర్ల విభాగం, లాంగ్‌ జంప్‌ మొత్తం మూడు విభాగాలో జరిగే పోటీల్లో హరికృష్ణ పాల్గొంటారని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు.

8నుంచి స్కూల్‌ గేమ్స్‌

జిల్లా జట్ల ఎంపిక

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 8,9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు ఆర్‌.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావులు తెలిపారు. ఈనెల 8వ తేదీన బాడంగి మండలంలో గల ఏపీడబ్ల్యూఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలలో అండర్‌–14,17,19 వయస్సుల విభాగాల్లో బాల,బాలికలకు మాల్కబ్‌ క్రీడాంశంలో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా 9వ తేదీన అండర్‌–17 బాల, బాలిలకు విజ్జి స్టేడియంలో అథ్లెటిక్స్‌ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 9,10 తేదీల్లో అండర్‌–11,14,17,19 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు స్కేటింగ్‌ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయని వివరించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని, జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

22 మంది కోడి పందాల రాయుళ్ల అరెస్టు

వేపాడ: మండలంలోని కొండగంగుబూడి పంచాయతీ ఎస్‌.కోట సీతారాంపురం సమీపంలోని కొండల్లో బుధవారం సాయంత్రం వల్లంపూడి పోలీసులు నిర్వహించిన దాడుల్లో 22 మంది కోడి పందాల రాయుళ్లు పట్టుబడినట్లు వల్లంపూడి ఎస్సై ఎస్‌.సుదర్శన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై సుదర్శన్‌తో పాటు సిబ్బంది నిర్వహించిన దాడుల్లో 22 మంది కోడి పందాల రాయుళ్లు పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి రూ.61,330, 19 సెల్‌ ఫోన్లు, 13 పందెం కోళ్లు, 10 ద్విచక్రవాహనాలు, 13 కార్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుదర్శన్‌ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

విజయనగరం టౌన్‌: రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం తెలిపారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే.చౌదరి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వన్‌టౌన్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

సారాతో వ్యక్తి అరెస్టు

కురుపాం: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలో ఉన్న జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో బుధవారం దాడులు నిర్వహించగా సారా విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక గోపాలరావు ఐదు లీటర్ల సారా కలిగి ఉన్నట్లు గుర్తించి నిందితుడిని న్యాయ స్థానం నందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించిందన్నారు. సారా రవాణా, తయారీ, విక్రయాలపై నిఘా పెడుతున్నామని సారా సమాచారం తెలిస్తే ఫోన్‌ 6302936599 నంబర్‌కు ప్రజలు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement