హోంగార్డు కుటుంబానికి సిబ్బంది చేయూత | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు కుటుంబానికి సిబ్బంది చేయూత

Mar 26 2026 7:34 AM | Updated on Mar 26 2026 7:34 AM

హోంగార్డు కుటుంబానికి సిబ్బంది చేయూత

విజయనగరం క్రైమ్‌ : మహిళ హోంగార్డు ఎం.రోహిణికుమారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశాలకు అదనపు ఎస్పీ పి.సౌమ్యలత తన చాంబర్‌లో రూ.3,15,240ల చెక్కును బుధవారం అందజేశారు. రోహిణికుమారి కుమారుడు ఎం.హేమంత్‌బాబుకు సహోద్యోగులు సేకరించిన నగదును చెక్‌తో పాటు కోపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ఫ్యూనరల్‌ ఖర్చులుగా ఇచ్చిన రూ.5వేలు అందజేశారు. తోటి సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క రోజు వేతనాన్ని అందజేయడం అభినందనీయమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఇటువంటి సాయం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐక్యతతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా ఇస్తాయన్నారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రమేష్‌కుమార్‌, కార్యాలయ సూపరింటెండెంట వి.లలిత, కోపరేటివ్‌ కార్యదర్శి సుశీల, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement