పాలకొండ: కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం ఉదయం దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో లెక్కించారు. జనవరి 21 నుంచి ఈ నెల 24 వరకు 62 రోజులకు ఆలయంలోని ఎనిమిది హుండీల నుంచి రూ 9,56,439ల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు. లెక్కింపులో దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్.రామారావు, ఆలయ అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, పోలీస్ సిబ్బంది, ఏపీజీవీబీ సిబ్బంది పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని హుండీల ఆదాయం రూ.6.92లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరాముని ఆలయాల హుండీల ఆదాయం రూ.6,92,880 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ బొబ్బిలి డివిజన్ సీఐ ఎన్.రాజకుమారి పర్యవేక్షణలో గతేడాది డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకులు వి.వి.అప్పలాచార్యులు, టీటీడీఎస్‌టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


