జనగణన నిబంధనలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

జనగణన నిబంధనలపై అవగాహన అవసరం

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం: జనగణన నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి సూచించారు. జనగణన ప్రక్రియ రెండుదశల్లో జరుగుతుందని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు, రెండో దశలో జనగణన జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌ ఎన్నికల కంట్రోల్‌రూమ్‌లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు రెండురోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సారి జనగణన ఎలక్ట్రానిక్‌ విధానంలో జరుగుతుందన్నారు. సంబంధిత యాప్‌లో వివరాలు సక్రమంగా నమోదుచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డిగ్రీ కళాశాల లెక్చరర్‌, టీఓటీ డాక్టర్‌ వి.రాఘవస్వామి, మున్సిపల్‌, మండల స్థాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement