జాతీయ బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Mar 26 2026 7:34 AM | Updated on Mar 26 2026 7:34 AM

జాతీయ బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 21, 22 తేదీల్లో విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ సత్తా చాటారు. 70–75 కేజీల విభాగంలో తలపడిన క్రీడాకారుడు బి.సచిన్‌ బంగారు పతకం దక్కించుకోగా... మరో క్రీడాకారుడు డి.కార్తీక్‌ వెండి పతకం కై వసం చేసుకున్నాడు. ఇరువురు క్రీడాకారులు త్వరలో నాగపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, బాక్సింగ్‌ కోచ్‌ బి.ఈశ్వరరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement