విజయనగరం టౌన్: వంశీ ఆర్ట్ థియేటర్స్ (హైదరాబాద్) ప్రతీ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలలో భాగంగా ఈ ఏడాది పరాభవనామ సంవత్సర ఉగాదికి వివిధ రాష్ట్రాలలో తెలుగు సాంస్కృతిక సేవా సంస్థల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం (జీహెచ్‌వీ) సంస్థకు అపూర్వ గౌరవం దక్కింది. సంస్థ ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి పురస్కారాన్ని వంశీరామరాజు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మాట్లాడుతూ వంశీఆర్ట్ థియేటర్స్ అందించిన ఉగాది పురస్కారం స్వీకరించడంతో పాటూ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.


