గిరిసీమకు దారేదీ? | - | Sakshi
Sakshi News home page

గిరిసీమకు దారేదీ?

Oct 9 2025 6:02 AM | Updated on Oct 9 2025 6:02 AM

గిరిస

గిరిసీమకు దారేదీ?

గిరిసీమకు దారేదీ?

పార్వతీపురం రూరల్‌: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఆధునిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికీ కనీస రహదారి సౌకర్యం కలగానే మిగిలిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 226 గ్రామాలకు సరైన దారి లేక అక్కడి ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వాగులు, వంకలు, కొండలు, గుట్టలే వారికి శ్రీరామరక్షగా మారాయి. ప్రభుత్వ పాలకుల హామీలు నీటి మీద రాతల్లా మిగులుతున్నాయే తప్ప, వారి తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజనం కన్నీటి పర్యంతమవుతోంది.

అడుగు బయటపెడితే అష్టకష్టాలు

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల దుస్థితికి అద్దం పట్టే గ్రామాలు కోకొల్లలు. ప్రధానంగా 63.30 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించా ల్సి ఉన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నా యి. మరీ ముఖ్యంగా, 52 గ్రామాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, వాటికి కనీసం కాలిబాట కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వ ర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర వైద్యం అవసరమైతే డోలీలే వారికి అంబులెన్సులు. చదువుకోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాల న్నా, కిలోమీటర్ల కొద్దీ బురద, రాళ్ల మధ్య ప్రాణాల ను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిందే.

గ్రామాల వారీగా గణాంకాలు

అధికారిక లెక్కల ప్రకారం, కురుపాం, మక్కువ, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు మండలాల పరిధిలో 25 గ్రామాలకు రోడ్లు లేవు. సాలూరు మండలంలోని గంజాయిభద్ర, నేరెళ్ల వలస, కొదమ, సారిక వంటి పంచాయతీలలోని 14 గ్రామాలకు రహదారి నిర్మాణం అత్యవసరం. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురం వంటి అనేక మండలాల్లోని గిరిజన గ్రామాలది కూడా ఇదే దుస్థితి. ప్రతి ఏటా అధికారులు సర్వేలు చేయడం, ప్రతిపాదనలు పంపడం సాధారణ ప్రక్రియగా మారిందే తప్ప, ఆచరణలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల కొరతో, అటవీ అనుమతుల జాప్యమో కారణం ఏదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అమాయక గిరిజనులు. ఇటీవల బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి ఆదేశాలతో సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ దఫా అయినా పనులు చేస్తారా? లేదా ఎప్పటిలాగానే చేసిన సర్వే లేక్కలు కాగితాలకే పరిమితమవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి.

పాలకుల ప్రగల్భాలు..

సంక్షేమ రాజ్యమని, సుపరిపాలన అందిస్తున్నామని ఊదరగొట్టే పాలకుల మాటలకు, గిరిజన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా, జిల్లాలోని 226 ఆదివాసీ గ్రామాలకు కనీసం కాలిబాటను కూడా నిర్మించలేని ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అంటూ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. గిరిజనుల బతుకులు కన్నీటి సుడుల్లో చిక్కుకుంటే, పాలకులు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు.

రహదారి సౌకర్యం లేని 226 గిరిజన గ్రామాలు

బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధం

నిత్యం నరకం చూస్తున్న ప్రజానీకం

వైద్యం అవసరమైతే డోలీలే అంబులెన్సులు

గిరిజనుల గోడు పట్టదా?

ఎవరికై నా జ్వరం వచ్చినా, గర్భిణికి పురిటినొప్పులొచ్చినా ప్రాణాల మీద ఆశ వదులుకని డో లీలో ప్రయాణించాల్సిందే. వర్షాకాలం వస్తే మ రింత దారుణమైన పరిస్థితి. గిరిజనులు పిల్లల చదువులు, అరకొర అందించే రేషన్‌ అన్నీ ఆగిపోతాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన కుటమి నాయకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల కలక్టర్‌ ఆదేశంతో సర్వే చేసిన గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్‌ చేస్తున్నాం.

– పాలక రంజిత్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ

సంఘం ఉత్తరాంధ్ర ప్రధన కార్యదర్శి

గిరిసీమకు దారేదీ?1
1/2

గిరిసీమకు దారేదీ?

గిరిసీమకు దారేదీ?2
2/2

గిరిసీమకు దారేదీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement