
● మరో టెంట్..
ఇదిలా ఉండగా దశాబ్దాల నాటి నుంచి తెలుగుదేశానికి సిరిమానోత్సవం వేళ వీక్షించేందుకు ఒకే ఒక్క టెంటు ఉంటూ వస్తుంది. అశోక్‌గజపతిరాజుగానీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరత్రా నాయకులంతా కూడా అశోక్ కూర్చునే కోట బురుజు మీదకు వెళ్లి ఆయనతో పాటు కూర్చుని సిరిమానును వీక్షించేవారు. అంతేగానీ టీడీపీకి ఎంత ఎక్కువ మంది నాయకులున్నా.. ఇంకో టెంట్ అనేది వేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. అంతేకాకుండా అశోక్‌ను కాదని వేరే టెంట్ కింద నిలబడేందుకు కూడా టీడీపీ కార్యకర్తలకు ధైర్యం లేదు. నాగార్జునకు ఆ ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట నాగార్జున కొత్తగా టెంట్ వేసి అశోక్‌గజపతికి ఎదురుగా కూర్చుని జనానికి విక్టరీ సింబల్ చూపిస్తూ నిలబడడం ఆయన కేరీర్ పాలిట పెనుముప్పు అని ఆ పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు. నాగార్జున కూడా కోట పైకెక్కి అశోక్‌గజపతి కుర్చీ వెనకాల కూర్చుని సిరిమానును చూస్తే అయిపోయేది కదా.. కొద్ది గంటల కార్యక్రమం కోసం నాగార్జున ఏకంగా అశోక్ గజపతి కళ్లలో ఎందుకు పడాలి.. సొంతంగా ఎందుకు టెంట్ వేయాలి.. ఇదంతా ఆయన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది కాదా.. అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున కూర్చున్న డీసీసీబీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరత్రా నాయకులంతా అశోక్‌గజపతి వెనకాల కూర్చుని సిరిమాను చూశారు. మచ్చుకై నా ఒక్క ఎమ్మెల్యే కూడా నాగార్జున దగ్గర కూర్చుని కాసేపైనా ఉన్నారా... అంటే అదీ లేదు. నాగార్జున, కొద్ది మంది పీఏసీఎస్ డైరెక్టర్లు.. కొందరు చోటా నేతలు తప్ప ఆయన దగ్గర ఎవరూ లేరు. ఇదంతా చూస్తుంటే నాగార్జున సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అని కొందరు ఆ పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమిటో నాగార్జున చేసిన పని చూస్తుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్టుగా ఉందని కొందరు లోలోన గుసగుసలాడుతున్నారు.
ఇంకో
చిత్రం ఏమంటే...