
నేటి నుంచి బోధనేతర పనుల బహిష్కరణ
వీరఘట్టం: మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనా సమయం హరించుకుపోతున్నదని, ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా బోధనేతర కార్యక్రమాలు పెరిపోయాయని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనందున ఈ నెల 10 (శుక్రవారం) నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో నాయకు లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంఈవో డి.గౌరినాయుడుకు మెమొరాండం అందజేశారు. పాఠాలు చెబుతాం, పిల్లలకు భోజనం పెడతాం, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తాం, జీఎస్టీ 2.0 వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలలో జరగనివ్వమని తీర్మాన పత్రంలో పేర్కొన్నారు. సీపీఎస్ పై సరైన నిర్ణయం చేయకుంటే మరో ఉద్యమానికి సై అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే 12వ పీఆర్‌సీ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాల ని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో పోరుబాట చేపట్టేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంఈవోను కలిసిన వారి లో ఫ్యాప్టో నాయకులు ఎం.పైడిరాజు, ఎం.మురళి, బి.రామారావు, ఆర్.ధనుంజయనాయుడు, బి.దుర్గాప్రసాద్, ఎం.నరహరి, కె.సింహాచలం ఉన్నారు.