
అట్రాసిటీ బాధితురాలికి పెన్షన్ బకాయిల మంజూరు : కలెక్టర
పార్వతీపురం రూరల్: జిల్లాలోని పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన గండిపల్లి అచ్చమ్మకు రూ.1,81,236 పెన్షన్ బకాయిలను మంజూరు చేస్తూ కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హత్యకు గురైన ఆమె భర్త గండిపల్లి తౌడు తరఫున ఈ పరిహారం అందుకోనున్నారని తెలిపారు. 2023 మే నెల నుంచి 2025 ఆగస్టు నెల వరకు రావల్సిన పెన్షన్, కరువు భత్యంతో కలిపి ఈ మొత్తాన్ని మరికొద్ది రోజుల్లో నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా రూ.32,93,397 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో సూర్యనారాయణ గురువారం తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ.17,98,058 ద్వారా వచ్చిందని తెలిపారు. కుంకుమార్చనల టికెట్ల ద్వారా రూ.2,61,650, అంతరాలయం టికెట్ల ద్వారా రూ.1920, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వా రా రూ.3,01,400, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.4,71,240ల ఆదాయం వచ్చిందని తెలిపా రు. పూజలు, ఘటాలు, కేశ ఖండన తదితర ఇతర టికెట్ల ద్వారా రూ. 4,62,609 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ. 24,47,839లు సమకూరిందని వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.8,45,558 ఆదాయం అధికంగా వచ్చిందని తెలిపారు.
పార్వతీపురం రూరల్: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాతావర ణ మార్పుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 15 మండలాల పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో 65 చోట్ల నీటి నమూనాలను పరీక్షించినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు అన్ని తాగునీటి ట్యాంకుల్లో ప్రతీ రోజు క్లోరినేషన్ చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

అట్రాసిటీ బాధితురాలికి పెన్షన్ బకాయిల మంజూరు : కలెక్టర