
కరుసైపోయావా నాగార్జునా..!
న్యూస్‌రీల్
–IIలో
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
మారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్‌నెట్ సేవలను అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని
జేసీ ఆదేశించారు.
పాడి రైతులపై దాడి
కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపు
లేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా
రెచ్చి పోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
తన మటుకు తాను పడుకున్న సింహాన్ని జూలు పట్టి లాగి లేపి బక్కిరించుకున్నట్టు అయ్యింది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కిమిడి నాగార్జున పరిస్థితి. ఆత్మ గౌరవం.. ఆవకాయ బద్ద అనుకుంటూ ఏదేదో ఊహించుకొని అనవసరంగా ముళ్ల కంపలో పడినట్టు అయిపోయింది. దశాబ్దాలుగా డీసీసీబీ కాంపౌండ్‌లో కూర్చుని సిరిమానును చూసే సత్తిబాబును నాగార్జున తన ఉనికి కోసం అక్కడ నుంచి ఖాళీ చేయించి పాత అర్బన్ బ్యాంకు భవనం ప్రాంగణానికి మార్పించారు. ఇదేమయ్యా.. అంటే డీసీసీబీ వాళ్ల జాగిరు కాదు.. ప్రస్తుతం నా కంట్రోల్‌లో ఉంది.. నా కార్యకర్తలు, మా పార్టీ డైరెక్టర్లు, చైర్మన్లు వచ్చి కూర్చుంటారు.. మేం కూడా సిరిమానును చూస్తాం.. ఇది మా ఆస్తిత్వం.. ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అంటూ ఏదేదో చెప్పారు. ఈ అంశంపై సత్తిబాబు పెద్దగా ఏమి స్పందించకుండా ప్రభుత్వం కేటాయించిన జాగాలోనే కూర్చుని సిరిమాను చూసేందుకు సిద్ధమయ్యారు. ఆ అర్బన్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నాసిరకం కావడం.. నేల చదును చేయకపోవడం వంటి కారణాల వల్ల వేదిక అలా కిందికి దిగిపోగా బొత్స సత్తిబాబుతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు బెల్లాన చంద్రశేఖర్, సురేష్‌బాబు, బొత్స అప్పలనర్సయ్య వంటి వాళ్లు వేదిక పైనుంచి పడిపోయారు. ఈ సంఘటన సిరిమానోత్సవం రోజు పద్ద చర్చనీయాంశమైంది. చక్కగా డీసీసీబీ ప్రాంగణంలోనే కూర్చుని సిరిమాను చూసే సత్తిబాబును వేరే చోటకు మార్పించి, అక్కడ సరిగా ఏర్పాట్లు చేయలేదన్న అంశం ప్రజల్లోకి వెళ్లింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో చిత్రం ఏమిటంటే సిరిమాను కదిలేటపుడు ఎప్పట్లానే రాజ కుటుంబీకులు కూర్చునే కోట వద్ద.. ఇంకా ఈసారి సత్తిబాబు కూర్చున్న అర్బన్ బ్యాంకు వద్ద కొన్ని క్షణాలు ఆగి కాస్త వంగి ఆశీర్వదించి వెళ్లింది తప్ప డీసీసీబీ వద్ద అర క్షణం కూడా నిలవలేదు. అంటే సత్తిబాబు ఎక్కడ కూర్చున్నా.. ఆయన ప్రాధాన్యం, గౌరవం ఏమాత్రం తగ్గదని మరోసారి రుజువైంది.
వ్రతం చేసినా.. ఫలితం దక్కలేదు..
అశోక్‌కు ఎదురుగా టెంట్ వేయడమా.. ఎంత ధైర్యం!
డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున
సెల్ఫ్ గోల్

కరుసైపోయావా నాగార్జునా..!