
పి.ఆమిటిలో ఆదివాసీ దినోత్సవం
గుమ్మలక్ష్మీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఈ నెల 9)ను పురస్కరించుకొని గుమ్మలక్ష్మీపురం మండలంలోని పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల హెచ్‌ఎం బిడ్డిక లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థినులంతా గిరిజన సంప్రదాయ వేషధారణలతో అలరించారు. సంప్రదాయ పూజలు, నృత్యాలతో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీచర్ ఎం.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
పి.ఆమిటి పాఠశాలలో ఆదివాసీ దినోత్సవంలో బాలికల సందడి