
జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రల సరఫరా
పార్వతీపురం టౌన్: జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రలు సరఫరా చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,96,612 మంది అంగన్వాడీ, పాఠశాల, కళాశాల పిల్లలు, విద్యార్థుల లక్ష్యంగా ఆల్బెండజోల్400 మి.గ్రా మాత్రలు వేయించనున్నామని తెలిపారు. ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న డీవార్మింగ్ కార్యక్రమానికి జిల్లాకు సరఫరా చేసిన ఆల్బెండజోల్ మాత్రలను ఆయా వైద్యాధికారులు, సిబ్బందికి పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 12న మాత్రలు వేసుకోని వారికి ఈనెల 20న మాప్‌అప్ కార్యక్రమంలో మాత్రలు వేసేలా చర్యలు చేపట్టామన్నారు.
జిల్లా ఆస్పత్రిలో
ఉచిత కేన్సర్ స్క్రీనింగ్
పార్వతీపురం టౌన్: మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్–రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వారి సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రిలో మెగా ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి జి.నాగభూషణ రావు మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం మెడికల్ సూపరింటెండెంట్ డా.వై.నాగశివ జ్యోతి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 176 మందికి పరీక్షలు నిర్వహించి వారిలో 65 మందికి ఓరల్ కేన్సర్ స్క్రీనింగ్ చేశారు. వారిలో 4 అనుమానిత కేసులుగా, 1 నాలుకకు సంబంధించిన కేన్సర్‌గా నిర్ధారణ చేశారు. బ్రెస్ట్ కేన్సర్ పరీక్షలను 91 మందికి నిర్వహించి వారిలో 20 మందిని అనుమనితులుగా గుర్తించి డిజిటల్ మెమోగ్రఫీ పరీక్ష చేశారు. దీని ద్వారా వారిలో ఎవరికీ కేన్సర్ లేదని నిర్ధారించారు. 20 మందికి గర్భసంచి ముఖద్వారం కేన్సర్ పరీక్షలు నిర్వహించి వారిలో 10 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేశారు. వాటి రిపోర్టులను వారం రోజులలో అందించనున్నారు. కార్యక్రమంలో డా.హారిక, డా.కె.పాల్, మెమోగ్రఫీ టెక్నిషియన్స్ లక్ష్మి, జి.సుమన్, జిల్లా ఆస్పత్రి దంత వైద్యసిబ్బంది డా.ఎం.దినేష్ కుమార్, డా.ఆర్.శ్యామల పాల్గొన్నారు.
గాయత్రీమాతకు
పసుపు కొమ్ములతో అలంకరణ
రాజాం సిటీ: రాజాం గాయత్రికాలనీలో వెలసి న గాయత్రిమాతను పసుపు కొమ్ములతో ఆల య ధర్మకర్త కొండవేటి వివేకానంద, ఆలయ అర్చకులు వాస జగదీశ్వరరావు గురువారం అలంకరించారు. శ్రావణ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని పురస్కరించుని అమ్మవారిని అలంకరించినట్టు అర్చకులు తెలిపారు.
సీసీ కెమెరాలతో నిఘా
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం కొత్తగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. నేర నియంత్రణలో భాగంగా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు వైఎస్సార్ నగర్, మెడికల్ కాలేజ్, కాటవీధి, డబుల్ కాలనీ తదితర చోట్ల సీసీ కెమెరాలు పెట్టామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీటి సాయంతో నేర ప్రవృత్తికలిగిన వ్యక్తుల కదలికలపై నిఘావేస్తామన్నారు.

జిల్లాకు 2,13,000 ఆల్బెండజోల్ మాత్రల సరఫరా