
నాటు తుపాకులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం
పార్వతీపురం రూరల్: నాటు తుపాకులు కలిగి ఉండడం వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజల రక్షణ, భద్రత ప్రామాణికంగా, నేరాలు, అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ ను సంబంధిత స్టేషన్ల అధికారులు నిర్వహించారు. ఈ క్రమంలో పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ కొత్తవలస గ్రామంలో పార్వతీపురం రూరల్ పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా కొర్ర సీతారాం ఇంటి గడపలో నాటు తుపాకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్స్ లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరం అన్న విషయాన్ని గ్రామస్తులకు అర్థమయ్యే రీతిలో సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి