
యువకుడి ఆత్మహత్య
సీతంపేట: స్థానిక సొండివీధికి చెందిన నల్లా శివకుమార్ (34) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఒడిశాలోని గజపతి జిల్లా రసూరుకు చెందిన జ్యోతితో ఏడాది కిందట శివకుమార్‌కు వివాహం జరిగింది. తల్లిదండ్రులు వెంకట్, విజయలక్ష్మితో పాటు శివకుమార్, భార్య జ్యోతి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారింట్లో ఇటీవల కుటుంబ తగాదాలు ఎక్కువవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఇంటికి వచ్చి చూసిన తండ్రి వెంకటరావు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యసిబ్బంది నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు.
పురుగు మందు తాగి వ్యక్తి..
గజపతినగరం రూరల్: మండలంలోని ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన ఎండ.చిరంజీవి పురుగు మందు తాగి జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు విలేకరులతో ఆయన మాట్లాడుతూ మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తెలిపారు. చిరంజీవి నిత్యం మద్యం తాగుతూ తరచూ ఇంట్లో భార్యతో గొడవపడేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా భార్యతో గొడవ పడడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందును తాగేశాడు. స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య