నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు

Jul 29 2025 8:18 AM | Updated on Jul 29 2025 8:18 AM

నానో

నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు

పార్వతీపురం: యూరియా, డీఏపీకి బదులుగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చిన నానో యూరియా, నానో డీఏపీని రైతులు వినియోగించడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ రైతులకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ కౌంటర్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. నానో ఎరువులతో రైతులకు ఆర్థిక భారం తగ్గడంతోపాటు మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌ పాల్గొన్నారు.

ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లకు ఆదేశం

పార్వతీపురం: వచ్చేనెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లా, ఐటీడీఏల స్థాయిలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గిరిజన సంప్రదాయ వస్తువులు, పనిముట్లు, ఇతర సామగ్రి ప్రదర్శనకు మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా గిరిజన లబ్ధిదారులకు భూ పట్టాలు, ఉప కరణాలు, చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓలు అశుతోష్‌ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఏపీఓ ఎ.మురళీధర్‌, డీఆర్‌డీఏ , డ్వామా పీడీలు ఎం.సుధారాణి, కె. రామచంద్రరావు, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు రక్షణగా మిషన్‌ శక్తి

హింసకు గురైన మహిళలకు సహాయం చేసేందుకు, రక్షణ కల్పించేందుకు మిషన్‌ శక్తి–వన్‌స్టాప్‌ సెంటర్‌ పాత్ర కీలకమైనదని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో మిషన్‌ శక్తి–వన్‌స్టాప్‌ సెంటర్‌, ప్రీ మ్యారిటల్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

దత్తతకు ముందుకు రావాలి

పీ–4 విధానంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్‌ ఎ. శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. మార్గదర్శులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసి ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు.

వన్నాం–ఈదలవలస పరిసరాల్లో ఏనుగులు

కొమరాడ: మండల వాసులను గజరాజుల బెడద వీడడం లేదు. ఈదలవలస, పులిగుమ్మి, వన్నాం తదితర గ్రామ పరిసరాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు సోమవారం సంచరించింది. పొల్లాలోకి వెళ్లే రైతులు అప్రమంతంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రాత్రి పూట కురుపాం నుంచి మాదలింగి, దలాయిపీట, కెమిశీల, తొడుమ, పాలెం తదితర గ్రామాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

శ్మశాన వాటిక అభివృద్ధి

నిధులను ఎలా మళ్లిస్తారు?

బొబ్బిలి: గత ప్రభుత్వం శ్మశాన వాటిక అభివృద్ధికోసం మంజూరు చేసిన రూ.10లక్షల నిధుల ను దారి మళ్లించడం ఎంతవరకు సబబని పలు ఎస్సీ కుటుంబాలు బొబ్బిలి కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మిని నిలదీశారు. ఆ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని బొబ్బిలి పదో వార్డు గొల్లపల్లికి చెందిన తుట్ట తిరుపతి, రమ ణ, కూర్మారావు, రమేష్‌, డోల వెంకటరమణ తదితరులు కమిషనర్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు.

నానో యూరియాను పరిశీలిస్తున్న

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు1
1/1

నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement