మోగిన పుర నగారా | - | Sakshi
Sakshi News home page

మోగిన పుర నగారా

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

అమల్లోకి ఎన్నికల నియమావళి జిల్లాలో పురపాలికలవారీగా వివరాలు... నగర పంచాయతీలు

జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలకు ఎన్నిక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట మినహా మిగిలిన వాటికి ఎన్నికలు నామినేషన్లకు 3 రోజులే కేటాయించటంతో తప్పని హైరానా

అమల్లోకి ఎన్నికల నియమావళి

సత్తెనపల్లి: జిల్లాలో పురపాలికలకు ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పూనేఠ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. జిల్లా ఎన్నికల అధికారులు శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇదే రోజు ఆయా పురపాలికల పరిధిలో నామినేషన్లు స్వీకరించరున్నారు. నామినేషన్లకు తుది గడువు ఈ నెల 18వ తేదీ. రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

499 పోలింగ్‌ కేంద్రాలు

పురపాలిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాతో పాటు పుర పీఠాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగే చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల పరిధిలో 3,38,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో

పురుషులు 1,61,429 మంది, మహిళలు 1,76,796 మంది, ఇతరులు 69 మంది ఉన్నారు.

మున్సిపాలిటీ వార్డులు బూత్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు

చిలకలూరిపేట 48 96 40,589 45,946 19 86,554

వినుకొండ 36 69 22,815 24,366 05 47,186

సత్తెనపల్లి 36 72 23,223 24,968 05 48,196

మాచర్ల 36 71 22,069 24,445 06 46,520

పిడుగురాళ్ల 40 68 26,364 28,575 16 54,955

గురజాల 23 69 10,746 11,936 02 22,684

దాచేపల్లి 28 54 15,623 16,560 16 32,199

మొత్తం 247 499 1,61,429 1,76,796 69 3,38,294

స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement