– జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి | - | Sakshi
Sakshi News home page

– జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

నరసరావుపేట రూరల్‌: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తుందని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. రానున్న మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తన్నారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 28 మండలాలు, 34 పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 525 గ్రామ పంచాయతీలకు సంబంధించి 5,476 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అత్యంత సున్నితమైన, సున్నితమైన, సాధారణ పోలింగ్‌ ప్రాంతాలుగా వర్గీకరించినట్టు తెలిపారు. ఎన్నికల విధుల కోసం అధికారులు, సిబ్బందితో పాటు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌పోర్స్‌, ప్లయింగ్‌ స్క్వాడ్స్‌, తనిఖీ కేంద్రాలు, షాడో పార్టీలను నియమిస్తున్నట్టు వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్స్‌లను బైండోవర్‌ చేసినట్టు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement