ఉపాధి కోసం వచ్చి.. విగతజీవులై... | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం వచ్చి.. విగతజీవులై...

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

కథలాపూర్‌: ఉన్న ఊరిలో పనులు లేక.. ఉపాధి వెతుక్కుంటూ జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఇద్దరు కూలీలు వినుకొండ ఆనంద్‌ బాబు (22), కొత్తజాను గమినేల్‌ ఉరఫ్‌ సంజీవ్‌(19) బావిలో పడి మృతిచెందడం స్థానికంగా విషాదం నింపింది. భవన నిర్మాణ పనులకు వచ్చి ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోవడం పలువురిని కంటతడి పెట్టించింది. ఆనంద్‌బాబు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందినట్లు సమాచారం. దీంతో చెల్లెను పోషించి పెళ్లి చేశాడు. ఉపాధి నిమిత్తం చింతకుంటలోని దేవండ్ల విష్ణు అనే మేసీ్త్ర వద్దకు ఎనిమిది రోజుల క్రితం వచ్చాడు. ఇక్కడ పనులు బాగానే ఉన్నాయని తనకు పరిచయమున్న గమినేల్‌కు చెప్పడంతో కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు, తమ్ముడి అవసరాల కోసం నాలుగు రోజుల క్రితం చింతకుంటకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద మద్యం సేవించారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement