ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకే విధులు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకే విధులు

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు (ఏఈఆర్‌ఓ)లు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల విధులు కేటాయించిన ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, మాస్టర్‌ ట్రైనర్లతో ఎన్నికల సరళి, నిర్వహణ, నిబంధనలపై బుధవారం సాయంత్రం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఓల పాత్ర ఎంతో ముఖ్యమని, వారు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారుల బృందం అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ కోసం అంతా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్నారు. సందేహాలు ఉంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని, సొంత నిర్ణయాలు వద్దన్నారు. నామినేషన్‌ ప్రక్రియలో ఒత్తిడిలు వచ్చినా నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలని, నామినేషన్లు తిరస్కరణకు సంబంధించి స్పష్టమైన కారణాలను నమోదు చేయాలన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై ఒక కమిటీ విచారణ చేస్తుందన్నారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement