నమ్మించి మోసం | - | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

నమ్మించి మోసం అధికారంలోకి వస్తే రూ. పది వేలు గౌరవ వేతనం ఇస్తామని వలంటీర్లను నమ్మించారు. ఓట్లు పడ్డాక ఆ ఊసే ఎత్తలేదు. వలంటీర్ల పొట్ట కొట్టారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులివ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. టీడీపీ నేతలకు ఇది సరికాదు. ఇకనైనా వలంటీర్లకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. వారు చేసిన ప్రజాసేవను పరిగణనలోకి తీసుకోవాలి. తిరిగి విధుల్లోకి తీసుకుని తగిన న్యాయం చేయాలి. ఎన్నికల సమయంలో తాము గెలిచాక వలంటీర్లకు వేతనాన్ని రూ. వేలు చేస్తామని చంద్రబాబు అంటే నమ్మి మోసపోయాం. వలంటీర్‌ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేవి. అప్పట్లో రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వలంటీర్ల పొట్ట కొట్టారు. ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లకు రూ.లక్షలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది ఎలా న్యాయమో ప్రభుత్వం ఆలోచించాలి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందించిన వలంటీర్లను చంద్రబాబు అవమానించారు. గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తేనే వృథా అని నాడు నానాయాగీ చేశారు. ఎల్లో మీడియా కూడా పదేపదే వ్యతిరేక వార్తలు రాసింది. కానీ నేడు ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో జనం డబ్బును టీడీపీ కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు సిద్ధమవడం అన్యాయం. ప్రభుత్వ భజనకు ప్రజాధనం వృథా తగదు. ఇకనైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

మా పొట్ట కొట్టారు

భజన బృందానికి ప్రజాధనం ఇస్తారా?

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

– కరుణ కొండయ్య, తెనాలి

– పిల్లి అజిత్‌కుమార్‌, తెనాలి

– చిన్నబాబు, అధ్యక్షుడు,

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ వలంటీర్ల విభాగం, పెదకూరపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement