వాగ్దేవి విద్యార్థికి వెండి పతకం | - | Sakshi
Sakshi News home page

వాగ్దేవి విద్యార్థికి వెండి పతకం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

నరసరావుపేట: ఇస్తాంబుల్‌లో గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన ఏషియన్‌ బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలలో పాల్గొన్న వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి సంకా కౌశిక్‌కు వెండి పతకం వచ్చినట్లు కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సంకా కౌశిక్‌ను అభినందించారు. జూనియర్‌ 93 కేజీల విభాగంలో పాల్గొన్న సంకా కౌశిక్‌ 190 కేజీల బెంచ్‌ ప్రెస్‌ ఎత్తి ద్వితీయ స్థానం పొందాడన్నారు. అభినందించిన వారిలో చైర్మన్‌ కాట్ల కోటేశ్వరరావు, డైరెక్టర్లు ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్‌బాబు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్‌, ప్రిన్సిపాల్‌ కపలవాయి రాజేంద్రప్రసాదు, ఫిజికల్‌ డైరెక్టర్లు రాజా మెర్సీన్‌, కృష్ణంరాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement