రెంటచింతల: ఏపీ పవర్ డిప్లొమో ఇంజినీర్స్ అసోసియేషన్ పల్నాడు సర్కిల్ నూతన అధ్యక్షడిగా ఎస్‌కే మస్తాన్‌వలి, కార్యదర్శిగా పూనూరి ఆనందరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఏపీ పవర్ డిప్లొమో ఇంజినీర్స్ అసోసియేషన్ పల్నాడు సర్కిల్ కార్యవర్గం ఎన్నిక జరిగింది. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జేఏవో కొండలు, ఎల్‌ఐ ఎస్.శ్రీనివాసచారి, జూనియర్ అసిస్టెంట్ అనిల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లైన్‌మెన్ వెంకటేశ్వర్లు, తాళూరి రాజు, వేముల సుదర్శన్ పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొన్నారు.


