జడ సురేంద్రకు అండగా వైఎస్సార్‌ సీపీ | - | Sakshi
Sakshi News home page

జడ సురేంద్రకు అండగా వైఎస్సార్‌ సీపీ

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

పిడుగురాళ్ల: జడ సురేంద్రకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఎస్సీ ఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్మూల్‌ శ్యామ్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం పట్టణ కన్వీనర్‌ జడ సురేంద్రను గురువారం వారు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి దళితులంటే అసూయ ఏర్పడిందని, ఆర్థికంగా బలంగా ఉన్న వారిని గుర్తించి వారిని పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందని తెలిపారు. దళితుడైన జడ సురేంద్రకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయటం జరుగుతుందని, అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకై నా సిద్ధమని వారు హెచ్చరించారు. జడ సురేంద్రను ఇబ్బందులకు గురి చేసిన పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును, టీడీపీ నాయకుడు నల్లాటి సుబ్బారావులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యులు జడ సురేంద్రను పరామర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కాలే మాణిక్యరావు, కార్యదర్శి, టౌన్‌ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు చల్లగుండ్ల స్వామి, వైఎస్సార్‌సీపీ నాయకులు పిల్లి ప్రేమానందం, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి సాతులూరి రమేష్‌, ఏడో వార్డు కన్వీనర్‌ మందా ప్రేమ్‌రాజు, 11వ వార్డు యూత్‌ కన్వీనర్‌ బంకా జాకోబ్‌, పిడుగురాల్ల మాజీ మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ మందా జాషుబా, పిడుగురాళ్ల టౌన్‌ ప్రధాన కార్యదర్శి గోసుల బుజ్జి, పాస్టర్‌ మందా జోసఫ్‌, కత్తి చిన్న, కత్తి నిఖిల్‌, మంద అబ్రహం, పాస్టర్‌ అబ్రహం, 17వ వార్డు మాజీ కన్వీనర్‌ బంకా అనిల్‌కుమార్‌, దొప్పలపూడి చంద్రశేఖర్‌, జంటగా సన్నీ, బందులూరి మరియదాసు, పాశం శ్యాంబాబు, కొమ్ము మోష, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్మూల్‌ శ్యామ్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement