వైఎస్సార్‌సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయండి
ప్రత్యేక కార్యక్రమంలో సూచించిన
జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహణ
నరసరావుపేట: జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డులలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కోరారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు పార్టీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన సుధాకర్‌బాబు మాట్లాడుతూ వచ్చే నెల 18వ తేదీలోగా ప్రతి రెండు గ్రామాలకు ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వలన స్థానికంగా నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.
● పార్టీ పల్నాడు జిల్లా పార్లమెంటరీ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కందుల రవీంద్రారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, చిలకలూరిపేట సమన్వయకర్త విడదల రజిని, పెదకూరపాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, గుత్తికొండ అంజిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్, రాష్ట్ర ఎస్‌సీ సెల్ కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా ఎస్‌సీ సెల్ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా డాక్టర్ల విభాగ అధ్యక్షులు డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు పాల్గొన్నారు.
జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు
టీజేఆర్ సుధాకర్‌బాబు


