
కేంద్రం నిర్వహణ ఎన్ని రోజులు..
ఈ ఏడాది జూన్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యడ్లపాడు మండలం మైదవోలు– వంకాయలపాడు పంచాయతీల్లోని స్పైసెస్ పార్కులో దీనిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. 38 రోజులు మాత్రమే కేంద్రం పనిచేసింది. ఈ కేంద్రం ద్వారా 258 మంది రైతుల నుంచి రూ.6,12,75,170 విలువైన 6821 బేళ్లు(5727 క్వింటాళ్ల)ను బయ్యర్లు కొనుగోలు చేశారు. వీటిలో హెచ్‌డీఆర్ (రూ.12 వేలు) రకం 589 బేళ్లు, హెచ్‌డీఎం (రూ.9 వేలు) రకం 2651 బేళ్లు, హెచ్‌డీఎక్స్ (రూ.6 వేలు) రకం 3581 బేళ్లు ఉన్నాయి.
బీటీ రోడ్డు పక్కనే నిల్వ చేసుకున్న పొగాకు చెక్కులు