ఒకరి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
జయపురం:
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడాడరు. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి కెర్మిటీ గ్రామ పంచాయతీ పరిధి జవాపొదర్ కూడలి వద్ద సోమవారం చోటుచేసుకుంది. మరణించిన యువకుడు జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి నీలాగుడ గ్రామ వాసి తీర్ పొరజ(20)గా గుర్తించారు. గాయపడిన వారు గులిగుడ గ్రామవాసి శుక్ర పొరజ (42) తీవ్రంగా గాయపడగా తీర్ పొరజ బైక్ పై వస్తున్న తీర్ భార్య, రెండేళ్ల కుమార్తెలు స్వల్పంగా గాయపడ్డారు. కుంధ్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తీర్ పొరజ, అతడి భార్య, రెండేళ్ల బిడ్డతో బైక్‌పై అత్తగారి ఇంటికి వెళ్తున్నారు. సమయంలో శుక్ర తమ గ్రామానికి బైక్‌పై వెళ్తూ మలుపు తిరుగుతున్న సమయంలో రెండు బైక్‌లు ఢీకొన్నట్టు వెల్లడించారు. మృతుడు తీర్ పొరజ తన అత్తగారి గ్రామం చేరేందుకు 500 మీటర్ల దూరం ఉండగా జవాపొదర్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలోనే తీర్ పొరజ మరణించాడు. ప్రమాదంలో బలమైన గాయాలు కావటంతో తీర్ పొరజ సంఘటనా స్థలం వద్దనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుంధ్ర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపారు. తీర్ పొరజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన శుక్ర పొరజను కుంధ్ర కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే తతని తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు కుంధ్ర కమ్యూనిటీ ఆస్పత్రి డాక్టర్ అరవింద పండ తెలిపారు.


