తరలివచ్చిన బీజేడీ శ్రేణులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరిలో బీజేడీ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మానస్ మడ్కామి పర్యవేక్షణలో సోమవారం మాత్తిలి సమితిలో జన సంపర్క పాదయాత్రను నిర్వహించారు. జిల్లా పరిషత్ జోన్–1 పరిధిలోని కియాంగ్ హోట్‌పడా వద్ద మాత్తిలి సమితి బీజేడీ అధ్యక్షుడు సదాశివ పూజారి నాయకత్వంలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేడీ అధికారంలో ఉన్న సమయంలో వేగవంతమైన అభివృద్ధి సాధించి ఒడిశా దేశ వ్యాప్తంగా ఆదర్శ రాష్ట్రంగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత అసమర్ధ డబుల్ ఇంజన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా అధ్యక్షుడు మానస్ మాడ్కమి పార్టీ నాయకులు, కార్యక్తలు కు సూచించారు. మాత్తిలి సమితిపరిషత్ జోన్–1 పరిధిలో నిర్వహించిన జనసంపర్క్ పాదయాత్ర సనలో గౌరవ అతిథులుగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, జిల్లా బీజేడీ మాహిళ సభ్యురాలు లక్ష్మీప్రియా నాయక్ పాల్గొన్నారు.


