అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

పర్లాకిమిడి: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సోమవారం జగన్నాథ మందిరం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు వద్ద బైఠాయించారు. ఆల్‌ ఇండియా అంగన్‌వాడీ లేడీస్‌ వర్కర్స్‌ అసోయేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమితి నిర్ణయం మేరకు గజపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ కలిసి ఈ ఆందోళన జరిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ఉద్యోగులుగా గుర్తించి రూ.30వేలకు జీతం పెంచడం, సహాయకులకు రూ.15 వేల పెంపు, సర్వీసు పెంచడం వంటి పది డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షురాలు కున్నిజన్ని అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర సహాయ కార్యదర్శి అంజలీ నాయక్‌, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ అధ్యక్షులు సుజిత్‌ ప్రధాన్‌, సెక్రటరీ పుష్పాంజలి పండా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement