ఆయుర్వేద వైద్యంపై విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద వైద్యంపై విస్తృత ప్రచారం

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

జయపురం:

ఆయుర్వేద వైద్యంపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు చేరువ చేయాలని కొరాపుట్‌ జిల్లా ఆయుర్వేద వికాసపరిషత్‌ నిర్ణయించింది. జయపురం యాదవ భవనం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పరిషత్‌ కార్యవర్గ సమావేశం ఆయుర్వేద వైద్య విస్తరణపై సభ్యులు చర్చించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, జిల్లా ఆయుర్వేద పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ సుదర్షణ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 14వ తేదీన జయపురం సమితి జయంతిగిరి గ్రామంలోని ఠకురాణి ఆలయ ప్రాంగణంలో విస్తృత సమావేశం నిర్వహించి ఆయుర్వేద మూలికలపై చర్చలు జరపాలని సమావేశంలో నిర్ణయించినట్లు పరిషత్‌ న్యాయసలహాదారు రాజేంద కుమార్‌ గౌఢ ‘సాక్షి’కి సోమవారం తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్య శిబిరాల నిర్వహణపై కూడా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఆదివాసీ గ్రామీణ వైద్యులను, దిశారీలను ఆహ్వానించి సత్కరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. సమావేశంలో ఆయుర్వేద వికాస పరిషత్‌ జిల్లా కార్యదర్శి కవిరాజ్‌ పరమేశ్వర పాత్రో, డాక్టర్‌ బసంత కుమార్‌ సాహు, ఆయుర్వేద వైద్యులు శ్రీనివాస పాద, రఘునాథ్‌ అమనాత్య, రామనాథ్‌ అమనాత్య, తులా పూజారి, కళియ గౌఢ, లీలు పాత్ర, దిలీప్‌ పాత్రో, మధు గౌఢ, సహాయ కార్యదర్శి సత్య నారాయణ పరిచా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement