కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి సమన్వయంతో నడుస్తున్న మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి ఒనక ఢిల్లి సమీపం లో మాచ్‌ఖండ్ లో జల విద్యుత్ కేంద్రం కేబుల్ లో పేలుడు జరిగింది. మొదట ప్రాజెక్టులోని 132 బై 11 కేవీ బ్యాక్ ఫీడింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించింది. దీంతో 11 కేవీ కేబుల్ పేలిపోయింది. అదే సమయంలో అక్కడ విధులలో ఉన్న తాత్కాలిక ఉద్యోగి రామ పరజా వీపునకు నిప్పంటుకుంది. దీంతో ఆయన ప్రాణభయంతో కేకలు వేశాడు. వెంటనే సహోద్యోగులు అతడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని లమ్తాపుట్ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం ఆశా కిరణ్ ఆస్పత్రికి తరలించారు.


