క్షయ రహిత జిల్లాగా మల్కన్‌గిరి | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత జిల్లాగా మల్కన్‌గిరి

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

● సీడీఎంవో మానస్‌ రంజాన్‌

పండా జోష్‌

మల్కన్‌గిరి: క్షయ రహిత జిల్లాగా మల్కన్‌గిరిని మార్చాలని సీడీఎంవో, జిల్లా వైద్యాధికారి మానస్‌ రంజాన్‌ పండా జోష్‌ అన్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి తీసుకోవాల్సి చర్యలపై శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని, అలాగే వ్యాధిపై ప్రజాల్లో అవగహన కాల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. క్షయవ్యాధి నివారణలో విశేష కృషి చేసి ధ్రువపత్రాలు పొందిన ప్రజాప్రతినిధుల అంకితభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. అందరి సమిష్టి సహకారంతోనే జిల్లాను క్షయవ్యాధి రహితంగా మార్చడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నివారణకు కృషి చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకు సీడీఎంవో, పీహెచ్‌వో పండా చేతుల మీదగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భ్‌ంగా పాంప్రీపాణి నాయబ్‌, సర్పంచ్‌ ఖిఆల్లనా గోలోరీ, పెడవఢ సర్పంచ్‌ బనితా కురామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement