రాయగడ: ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ 149వ జయంతిని జేకేపూర్, రాయగడలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, జేకేపేపర్ మిల్ ప్రజా సంబంధాల శాఖ అధికారి హరిహర ఖమారి, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు పట్నాన గౌరి శంకర్‌లు గోపబంధు దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్థానిక ఉత్కళ సమ్మేళిని రాయగడ శాఖ ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బ్రజసుందర్ నాయక్, ఉత్కళ సాహిత్య సమాజ్ అధ్యక్షులు, విద్యావేత్త డీకే మహంతి, శివప్రసాద్ మిశ్రా, కార్తీక్ మిశ్రో, సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ రాజేష్ పాడి, ఉత్కళ సమ్మేళిని సహా కార్యదర్శి సుదర్శన్ పాడి తదితరులు గాంధీపార్క్‌లోని గోపబంధు దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాస్ సేవలు ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.


