సేవా సేతు శిబిరంతో సంక్షేమ పథకాలు చేరువ | - | Sakshi
Sakshi News home page

సేవా సేతు శిబిరంతో సంక్షేమ పథకాలు చేరువ

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

రాయగడ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, ప్రజల్లో సామాజిక సేవాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా రాయగడ సమితి కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం నాడు సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా సేవా సేతు శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 27 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు, బ్యాంక్‌ రుణాలు, ఇతర ప్రయోజనాలను అందజేశారు. 500 మందికి పైగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథఽకాలపై అవగాహనకు వేదికగా నిలిచింది. సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, ప్రత్యేక అభివృధ్ది మండళి పాధ్యాక్షురాలు మంజుల మినియాక, జిల్లా పరిషత్‌ సభ్యురాలు సంద్యా పులక బిజేపీ నాయకులు కాలీరాం మాఝి, బసంత ఉలక, శివకుమార్‌ పట్నాయక్‌, రజితా కొరాడ, ఎబిడిఒ కాళుచరణ్‌ నాయక్‌, కొంచాడ అశ్విని, శివశంకర్‌ ఉలక హాజరయ్యారు.

వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం

శ్రమ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు లబ్ధిదారులకు ఒక్కోక్కరికీ రూ. 50 వేలు చొప్పున వివాహ ప్రోత్సాహక సహాయం, మరో ఇద్దరికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున మరణాంతర సహాయాన్ని అందించారు. గృహ నిర్మాణ పథకం కింద ఇద్దరికి రూ. 20 వేలు చొప్పున, అంత్యోదయ గృహ నిర్మా ణం పూర్తి చేసేందుకు మరో లబ్ధిదారునికి పది వేల రూపాయలు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అలాగే 11 మందికి కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement