చెత్త నిర్వహణలో భారీ అక్రమాల ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

చెత్త నిర్వహణలో భారీ అక్రమాల ఆరోపణలు

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

రాయగడ: పట్టణాన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా మార్చాల్సిన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్థానిక మజ్జిగౌరి అమ్మవారి మందిరానికి సమీపంలోని పాత డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో వేరు చేసి శుద్ధి చేసి, పునర్వినియోగానికి తరలించాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టు సంస్థ వ్యర్థాలను పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్‌ చేయకుండానే ట్రక్కుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో పనులు పూర్తి కాకపోయినా 63 శాతం పూర్తయినట్లు రికార్డుల్లో చూపించారనే ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో మున్సిపాలిటీ అధికారులు, కాంట్రాక్టు సంస్ధ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పట్టణంలోని పలువురు ప్రజలు, మేధావులు కోరుతున్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని పాత డంపింగ్‌ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు గత ఏడాది అక్టోబరు 10వ తేదీన సుమారు రూ.3.19 కోట్లతో టెండర్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో డంపింగ్‌ యార్డులో రెండుసార్లు అగ్నిప్రమాదాలు చొటు చేసుకోవడం, చెత్త దహనం కారణంగా పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగించింది. ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ కార్యనిర్వాహణ అధికారి కులదీప్‌ కుమార్‌ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, టెండర్‌ పొందిన సంస్థ రోజుకు 500 నుంచి 600 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను నిర్వహిస్తోందని, ఇప్పటివరకు సుమారు 10 వేల నుంచి 15 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను విశాఖపట్నంలోని సిమెంట్‌ కర్మాగారానికి పంపినట్లు తెలిపారు. వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను మున్సిపాలిటీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement