కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగానూ పరిపూర్ణంగాను ముగిసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ బంద్ జరిగింది. ముందే పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రావాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. బంద్ ప్రభావం జయపూర్ పట్టణం పై గట్టిగా పడింది. ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి అనుచరులు జయపూర్,బొరిగుమ్మ ప్రాంతాల్లో బంద్ విజయవంతం చేశారు. పోలీసుల వైఖరి వివాదాస్పదం కాగా ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు కొరాపుట్ జిల్లా కేంద్రం లో డీసీసీ అధ్యక్షుడు రుపక్ తురుక్, లక్ష్మీపూర్ లో ఎమ్మెల్యే పవిత్ర శాంత,నబరంగ్‌ఫూర్ లో మాజీ డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠిలు బంద్ ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.


