భువనేశ్వర్: బాంబుల మోతతో జాజ్‌పూర్ వ్యాసనగర్ అటానమస్ కళాశాల దద్దరిల్లింది. బుధవారం రాత్రి ప్రిన్సిపాల్ గది, బాలుర హాస్టల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అర్ధరాత్రి జరిగిన బాంబుల దాడి కళాశాల ప్రాంగణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటనతో కళాశాల అధికారులు, విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా నిఘా వేసేందుకు పోలీసు భద్రత కల్పించారు. అయితే రాత్రి సమయం కావడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోవడం వలన ఎవరికీ ఎటువంటి గాయాలవ్వలేదు.


