రాయగడ: రైల్వే ప్రయాణికులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలంటే తగిన భద్రత, నియ మ, నిబంధనలు పాటించాలని ఆర్పీఎఫ్ పోలీసు లు అన్నారు. ఈ మేరకు రాయగడలోని రైల్వే ఫ్లాట్ పారం వద్ద ప్రయాణికులకు గురువారం అవగాహ న కల్పించారు. రైలులో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రైలు ఎక్కేటప్పుడు, దిగే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. టికెట్టు లేని ప్రయాణం నేరమన్నారు. అపరిచితులు ఇచ్చే ఆహారాలు తీసుకోవద్దని, వారికి తమ వెంట తీసుకువచ్చే సామగ్రీని అప్పగించి ఎక్కడికీ వెళ్లకూడదన్నారు. ఫ్లాట్ ఫారంలో రైలు గురించి వేచి ఉండే ప్రయాణికులు రైలు పూర్తిగా ఆగిన తరువాత ఎక్కాలన్నారు. ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ బి.కె.బాల్, కానిస్టేబుల్ కేకే రావు,హెడ్ కానిస్టేబు ల్ దాస్, మహిళా కానిస్టేబుల్ ఎ.లక్ష్మి పాల్గొన్నారు.


