రూ.వంద కోట్ల విలువైన గంజాయి నూనె స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.వంద కోట్ల విలువైన గంజాయి నూనె స్వాధీనం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

మల్కన్‌గిరి :

ల్కన్‌గిరి జిల్లాలో నషాముక్త ఒడిశా కార్యక్రమంలో భాగంగా మల్కన్‌గిరి పోలీసులు ఒక పెద్ద విజయాన్ని సాధించారు. జిల్లా చిత్రకొండ సమితిలో గంజాయి నూనె తయారవుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో ఎస్‌ఆర్‌ కంపెనీ సమీపంలో ఆదివారం ఉదయం చిత్రకొండ ఎస్‌డీపీఓ ప్రదోష్‌ ప్రధాన్‌ నాయకత్వంలో ఓ బృందం పోలీసులు పెట్రోలింగ్‌ ప్రారంభించారు. ఆ సమయంలో వాహనం తనిఖీ చేస్తుండగా స్మగ్లర్ల గుంపు తప్పించుకున్నారు. వాహనంలో మొబైల్‌ తయారీ యూనిట్‌తో పాటు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌లో సుమారు 800 లీటర్ల కెమికల్స్‌, స్వాల్వెంట్లు, 50 కిలోల గంజాయి, 2 లీటర్ల గంజాయి నూనె స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా 800 లీటర్లు గంజాయి నూనె తయారు చేయవచ్చని, దీని విలువ మార్కెట్‌లో రూ.100 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement