రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రిలో బజరంగదళ్, శ్రీరామ మందిరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో 43 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో రక్త నిల్వలు కొరత ఏర్పడటంతో గుర్తించిన ఈ సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సంస్థలకు చెందిన సభ్యులు, ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని చేశారు. డీహెచ్ హెచ్ బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షులు వినయ్ ద్వివేది, కమల్ కుమార్ సింగ్, ప్రకాష్‌కుమార్ సింహ్, విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ ఉపాధ్యక్షులు ప్రఫుల్ల పాత్రో, శశ్యజ్యోతి బెహర పాల్గొన్నారు.


