రాయగడ: జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోహన్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఒడిశా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఉత్వర్వులు జారీ చేసింది. ఒడిశా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మహేష్ దేశ్‌ముఖ్, అసిస్టెంట్ ఇన్‌చార్జి రియానా రాజుల పేరుతో విడుదలైన ప్రకటనలో భాగంగా పార్టీని మరింత బలొపేతం చేయడానికి యువత ముందుకు రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా అనుగుల్ జిల్లాకు బిశ్వరంజన్ పాణిగ్రహి, భద్రక్ జిల్లాకు బలరాం రౌత్, బలంగీర్‌కు అంకిత్ సాహు, కటక్ సిటికి బిప్లవ్ శిలియాదిత్య, డెంకానాల్‌కు సుభం దాస్ అధ్యక్షుడిగా, భిభూతిభూషన్ మహాంతి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జగత్సింగ్‌పూర్ జిల్లాకు కుమార్ ప్రీతమ్ పరిజ, కేంద్రపడ జిల్లాకు లక్ష్మీప్రియ నాయక్, ఖుర్ధ జిల్లాకు స్వాగత్ కర్, మయూర్‌భంజ్ జిల్లాకు అధ్యక్షునిగా సరోజ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహమ్మద్ నజీరుల్ హక్, సుందర్‌ఘడ్ జిల్లాకు అషీప్ రాజ, బౌధ్ జిల్లాకు మహేశ్వర్ ప్రధాన్ లు నియమితులైనట్లు ప్రకటనలో వెల్లడించారు.


