జిల్లా అదనపు ఎస్పీ సునీల్ మహంతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్‌ఐ సునీల్‌కుమార్ శెఠి, కానిస్టేబుల్ సుభ్రత్ కుమార్ పండా
పర్లాకిమిడి: ఒడిశా పోలీసు–91వ ప్రతిష్ట(వ్యవస్థాపక) దినోత్సవాన్ని బుధవారం బెత్తగుడలో పోలీసు రిజర్వడ్ గ్రౌండ్స్‌లో అదనపు ఎస్పీ సునీల్ కాంత మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 1936 ఏప్రిల్ 1వ తేదీన ఒడిశా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒడిశా పోలీసు ప్రతిష్ట ఆవిర్భవించింది. పోలీసుశాఖలో అసువులు బాసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ కాంత మహంతి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీసు బెటాలియన్, ఓ.ఎస్.ఏ.పి, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ కవాతు చేపట్టారు. ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 2025–26 సంవంత్సరానికి పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హవల్దార్లు పది మందికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ బహుమతులు పొందిన పోలీసు అఽధికారుల్లో చంద్రగిరి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ సునీల్ కుమార్ శెఠి, కై లాష్ చంద్ర ముదులి, కానిస్టేబుల్ సుభ్రత్ కుమార్ పండా, ననీల్‌కుమార్ రోథో, కానిస్టేబుల్ ధీరజ్‌కుమార్ పోరిచ్చా, హవల్దార్ యు.వాసుదేవరావు, ఓ.ఎస్.ఏ.పి భుబేంద్ర కుమార్ బెహరా, శ్రేష్ట సిపాయిగా దాశరథి శోబోరో ఉన్నారు.


