రెండు ఓఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రెండు ఓఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రారంభం

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

రెండు ఓఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రారంభం

పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓ.ఎస్‌.ఆర్‌.టి.సి) ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్స వం పురస్కరించుకుని బుధవారం పూరీ, గజపతి జిల్లా అడవ, కటమాకు రెండు బస్తులు వేసింది. బస్సుల ప్రారంభోత్సవ సభకు అతిథిగా ఏ.డి.ఎం ఫల్గుణి మఝి విచ్చేశారు. గజపతి ప్రైవేటు బస్సు యాజమాన్యం సంఘం అధ్యక్షులు ఛిత్రి సింహాద్రి, కార్యదిర్శి ఇంజా వెంకటరమణ, పురపాలక కౌన్సిలర్‌ బబునా బెహరా, బీజేపీ సాధారణ కార్యదర్శి జగన్నాథ మహాపాత్రో, బీజేపీ నాయకుడు డుల్లు మిశ్రా, భరత్‌ భూషణ్‌ మహంతి తదితరులు విచ్చే సి మాట్లాడారు. పర్లాకిమిడి నుంచి ఉదయం ఏడు గంటలకు పూరీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు బయలుదేరి జిరంగో, మహేంద్రగిరి బైపాస్‌, తుంబ, పాత్రపురం, జోరడా–చికిటి, బరంపురం మీదుగా ఛత్రపురం, గంజాం, చందన్‌పూర్‌ మీదుగా పూరీకి మధ్యాహ్నం చేరుకుంటుంది. పూరీ నుంచి రాత్రి ఏడు గంటల కు బయలుదేరి తెల్లవారుజామున పర్లాకిమిడికి చేరుకుంటుంది. మరో బస్సు పర్లాకిమిడి నుండి ఉప్పలాడ, రాయఘడ, ఆర్‌.ఉదయగిరి, చంద్రగిరి, మోహానా మీదుగా కటమా (బ్రాహ్మణగాం సరిహ ద్దు) వరకు ప్రయాణిస్తుంది. ఈ బస్సు వల్ల గిరిజన గ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని ఓ. ఎస్‌ ఆర్టీసీ జిల్లా మేనేజర్‌ తన్మయి కుమార్‌ ప్రధాన్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువజ న నాయకుడు కోట్ల యువరాజ్‌, దారపు చిట్టి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement