రాయగడ: ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని విశాఖపట్నం నుంచి వచ్చిన ధ్యానగురు టి.రేవతి దేవి అన్నారు. స్థానిక సాయిప్రియ లేడీస్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాంబాబు అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవుని నిత్యజీవితం ఒత్తిడితో కొనసాగుతుందన్నారు. ఒత్తిడిని నియంత్రించాలంటే ధ్యానమే ప్రధాన అస్త్రమని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధాన్యం చేయాలని సూచించారు. క్లబ్ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లాడి చంద్రమౌళి, క్లబ్ కార్యదర్శి మాధురి, కోశాధికారి నిర్మల పట్నాయక్ పాల్గొన్నారు.


