పర్లాకిమిడి: గజపతి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కు మార్ పండా మంగళవారం తన పదవీ విరమ ణ చేశారు. ఈ సందర్భంగా రాణిపేట డీపీఓ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభను సిబ్బంది ఏర్పాటు చేశారు. గంజాం జిల్లా బరంపురం ఎస్పీ ఎం.శరవణా వివేక్ గజపతి జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు స్వీకరించా రు. 2015 ఐ.పి.ఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్ శరవణా గజపతి జిల్లాకు అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఆర్.ఉదయగిరి) రాకేష్‌కు మార్ (ఐ.పి.ఎస్.), అదనపు జిల్లా ఎస్పీ సునీ ల్ కాంత మహంతి, పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత్ భూపతి, మోహనా పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో, ఇతర సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు తెలిపారు.
భువనేశ్వర్: ఒడిశా కు చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు, స్థానిక డాక్టర్ అభిన చంద్ర హోమియోపతి వై ద్య కళాశాల మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంత్ నందా భార త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత వైద్యుడి గా నియమితులైనట్లు భారత ప్రభుత్వ ఆయు ష్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రాష్ట్ర, జాతీయ స్థాయిలో హోమియో పతి చికిత్స మరియు పరిశోధన రంగంలో విశేష కృషి చేశారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లా ము డిపూర్ పంచాయతీకి చెందిన ప్రముఖ కవి, ప్రజా నాయకుడు బైకుంఠనాథ్ నందా పెద్ద కుమారుడైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ నందా హోమియోపతి వైద్య రంగంలో సుప్రసిద్ధులు. ప్రొఫెసర్ నంద హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆయుష్ పరిశోధన, అభివృద్ధి విభాగానికి ఛైర్మన్‌గా సేవలందించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అనురాధ రిలీవ్‌కు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. ఆమెకు బీసీ సంక్షేమ శాఖ అధికారి నుంచి ఏబీసీగా డిమోషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆమె ఎవరికీ చెప్పకుండా విజయవాడ వెళ్లిపోయారు. దీంతో ఆమెను రిలీవ్ చేయడంలో సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. మార్చి 25న ఆమెకు రివర్షన్ ఉత్తర్వులు వస్తే, ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఆమె రిలీవింగ్‌పై ఎటువంటి చర్యలు లేవు. కాగా బుధవారం నాడు కలెక్టర్‌కి అధికారులు ఫైల్ పెట్టారు. అయితే ఈ జాప్యం వెనుక కూడా డీబీసీ హస్తం ఉందని తెలుస్తోంది. తనకు రిలివీంగ్ జాప్యం చేస్తే, విజయవాడ నుంచి మరలా అక్కడ ఉన్నవారిచే సర్దుబాటు చేయించుకొనే ప్రయత్నం చేయడం జరుగుతుందని ఇక్కడ అధికారులను తన రిలీవింగ్‌ను నొక్కి పెట్టించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆ కార్యాలయం వర్గాలు తెలుపుతున్నారు. డీబీసీ అనురాధ రిలీవింగ్ ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్ బుధవారం సాయంత్రంకి కలెక్టర్ చాంబర్‌కి చేరింది. గురువారం నాటికి ఆమె రిలీవింగ్ ఉత్తర్వులు రానున్నాయి. ప్రభుత్వం డీబీసీ అనురాధను ఏబీసీగా డిమోషన్ చేసి బదిలీ చేసింది తప్ప, ఆమె స్థానంలో జిల్లాకు డీబీసీని నియమించలేదు. దీంతో ఇన్‌చార్జిని వేయడం తప్పనిసరి. అలాగే డీబీసీగా ఆమె పనిచేసిన కాలంలో జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో బదిలీలు, పదోన్నతులు, ఇంక్రిమెంట్‌లు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియమాకాలు ఇచ్చారు. అంతేకాకుండా జిల్లాలో ఆమె చేసిన అవినీతిపై డైరక్టరేట్‌లో చర్చ జరుగుతోంది. ఈసారి ఆమైపె విచారణలో ఈ అవినీతి రుజువైతే, ఆమె నాలుగేళ్లు పొందిన అలవెన్సులు, జీతం సైతం రికవరీకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
10 నుంచి నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: ఈనెల 10వ తేదీ నుంచి బాపూజీ కళామందిర్‌లో శ్రీముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనునట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు బ్రోచర్‌ను బుధవారం విడుదల చేశారు. రోజుకు రెండు నాటికల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 12న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కె.శ్యామ్ కుమార్, పొగిరి సత్యం, రమేష్, ప్రసాద్‌దు, కీర్తి, కుమారి, సంతోషి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


